ఏపీ సర్కార్ మరో వివాదంలో చిక్కుకుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న పదవ తరగతి స్టడీ మెటీరియల్ వివాదాస్పదమైంది.
పూర్వ తూర్పుగోదావరిలో ఉండే పుస్తక కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని 480 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రూ. 1.20 కోట్లు వెచ్చించి 49వేల తెలుగు-ఆంగ్ల మాధ్యమ స్టడీ మెటీరియల్ పుస్తకాలను జడ్పీ నిధులతో ముద్రించారు.
అయితే, ‘జగనన్న విద్యా భారతి’ పేరుతో ముద్రించిన ఈ స్టడీ మెటీరియల్ పుస్తకం ముఖచిత్రంపై వైసీపీ రంగుల మధ్య ముఖ్యమంత్రి జగన్ తో సహా మంత్రాలు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, పినిపే విశ్వరూప్, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణు, జెడ్పి చైర్మన్, సీఈఓల చిత్రాలను ముద్రించారు.