మాములుగా టీ 20 ఫార్మాట్ లో బౌలర్లు ఎంత కింగ్ లు అయినా పరుగుల వరద తప్పదు. ఎక్కువగా భారీ స్కోర్ లు నమోదు అవుతూ ఉంటాయి. కానీ ఈ స్కోర్ లను ఛేదించడం అంతా ఈజీ కాదు, ఎంతో చాకచక్యంగా బ్యాటింగ్ చేస్తూ వికెట్లను కాపాడుకుంటూ ఆడితేనే ఎంత భారీ టార్గెట్ అయినా చేధించగలరు. కాగా ఈ ఐపీఎల్ లో భారీ టార్గెట్ ల ముందు పెద్ద టీం లు సైతం చతికిలపడుతున్నాయి. ఈ అంశంపైన మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ధోని లాంటి అతగాడిని చూసి ఈ యువకులు అంతా ఎలా ఛేజింగ్ చేయాలో నేర్చుకోవాలన్నారు. ఎంత స్కోర్ అయినా చివరి ఓవర్ వరకు క్రీజులో ఉండేలా ఆటను మలుచుకోవాలన్నాడు.
ఇంకా ధోని ఎలా అయితే వీక్ బౌలర్లను టార్గెట్ చేస్తాడో అదే సూత్రాన్ని మిగిలిన వాళ్ళు కూడా పాటించాలని చెబుతున్నారు. మరి ఈ ఐపీఎల్ లో పీటర్సన్ చెప్పిన ఈ ధోని సూత్రాన్ని ఎవరైనా పాటించి సక్సెస్ అవుతారా చూడాలి.