తూగో జిల్లాలో రచ్చకెక్కిన వైసీపీ వర్గ విభేదాలు.. ఏకంగా హోంమంత్రికే ?

-

తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. తోట త్రిమూర్తులుకి వ్యతిరేకంగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హోం మంత్రి మేకతోటి సుచరితకు లేఖ రాయటం సంచలనంగా మారింది. దళితుల శిరోముండనం కేసు విచారణ వేగవంతం చేయాలని హోం మంత్రిని కోరారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు ఆ జిల్లాలో ఇదే హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ లేఖ,మీద త్రిమూర్తులు స్పందిస్తూ శిరోముండనం కేసులో త్వరగా విచారణ చేసి తీర్పు ఇవ్వాలని కోరుకున్నారు. ఈ కేసులో తీర్పు కోసమే ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు.

కోర్టు తీర్పుల్లో నిర్దోషిగా బయటపడతానని.. వైసీపీలో ఎటువంటి వర్గ విభేదాలు లేవంటున్నారు త్రిమూర్తులు. హోం మంత్రికి లేఖ ఎందుక రాశారో పిల్లి సుభాష్ చంద్రబోసే చెప్పాలని పేర్కొన్నారు తోట త్రిమూర్తుల. ఇక శిరోమండనం కేసు విషయంలో పిల్లి సుభాష్‌ చంద్ర బోస్‌ మరో సారి ఫైరయ్యారు. 23 ఏళ్లుగా శిరోమండనం కేసు పెండింగ్‌ లో ఉందన్నారు. కేసు నీరుగార్చేందుకు వారికి అధికారం, సంపద కలిసి వచ్చాయని ఆరోపించారు. త్రిమూర్తులు కేసును ఏదో విధంగా సాగదీస్తూ ఉన్నారని విమర్శించారు పిల్లి. తోట త్రిమూర్తులు పీపీని మార్చమన్నారని తెలిపారు. అందుకే విచారణ జరిపించాలని హోం మంత్రికి లేఖ రాశామన్నారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌. 

Read more RELATED
Recommended to you

Latest news