సైన్యం బలోపేతం దిశగా మరో ముందడుగు పడింది. తాజాగా పినాక రాకేట్ వ్యవస్థ ఎక్స్ టెండెడ్ రేంజ్ ను ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. గత మూడు రోజులుగా దశల వారీగా పరీక్షలు జరుగుతున్నాయి. రాజస్థాన్ లోని పోక్రాన్ ఏరియాలో ఈ టెస్టింగ్ లు జరుగుతున్నాయి. డీఆర్డీవో, సైన్యం ఈ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేశాయి. ప్రయోగాల్లో భాగంగా గత మూడు రోజులుగా వివిధ శ్రేణులు, వార్‌హెడ్‌ల సామర్థ్యాలతో 24 రాకెట్లను ప్రయోగించినట్లు రక్షణ శాఖ తెలిపింది.