తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలావాటు చేయండి : పియూష్ గోయల్ సంచలనం!

-

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాల మధ్య వివాదం చెలరేగుతోంది. ధాన్యం కొనుగోలు చేయాలని.. తెలంగాణ రాష్ట్ర మంత్రులు.. ఢిల్లీలో మకాం వేశారు. మంత్రి పియూష్‌ గోయల్‌ తో వరుసగా సమావేశం అవుతున్నారు. కానీ ఫలితం లభించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌.. వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకానీ.. తాము మాత్రం బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయలేం అంటూ తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని.. ఫిబ్రవరి22, మార్చి 8 తేదీల్లో సమావేశాలకు రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాం. అయునా సమావేశానికి రాలేదని ఫైర్‌ అయ్యారు.

ఎంత మేరకు బియ్యాన్ని కేంద్రానికి ఇవ్వగలుగుతారో, తెలంగాణ వివరాలు ఇవ్వలేదని.. రైతులకు భ్రమలు కలిపిస్తూ, కేంద్రం పై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందం మేరకు, కేంద్రం కేవలం బియ్యాన్ని మాత్రమే సేకరిస్తుందని.. పంజాబ్‌ నుంచి కూడా బియ్యాన్నే సేకరిస్తుంది. నేరుగా ధాన్యాన్ని కేంద్రం సేకరించదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news