వర్షాకాలం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై పత్రిపక్షాలు నిరసనలు తెలుపుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో చర్చలకు అడ్డుపడుతున్నారంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలకు కాంగ్రెస్ అంతరాయం కలిగిస్తోందని బీజేపీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు.
ధరల పెరుగుదలపై చర్చ నుంచి ప్రభుత్వం పారిపోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.అంతేకాకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత అటువంటి సమస్యలను తీసుకోవచ్చని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. పార్లమెంటుకు ఎవరు అంతరాయం కలిగిస్తారనే దానిపై ప్రతిపక్షాల మధ్య పోటీ ఉందంటూ పీయూష్ గోయల్ విమర్శించారు.