తెలంగాణ మంత్రుల‌కు ఏం ప‌ని లేదా..? ఢిల్లీకి వ‌చ్చారు : పీయూష్ గోయ‌ల్‌

తెలంగాణ మంత్రులు, ఎంపీల‌పై పీయూష్ గోయ‌ల్ ఫైర్ అయ్యారు. తెలంగాణ మంత్రుల‌కు, ఎంపీల‌కు ఏం ప‌ని లేదా..ఢిల్లీకి వ‌చ్చి కుర్చున్నారంటూ పీయూష్ గోయ‌ల్ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. తెలంగాణ రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు భ్రమలను కల్పిస్తోందని.. కేంద్ర ప్రభుత్వ పరంగా రైతులకు భరోసా ఇస్తున్నాం. తప్పుడు సమాచారం నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నామ‌ని చెప్పారు.

గత రబీ సీజన్ లో ఇచ్చిన హామీ మేరకు ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయలేక పోయిందని ఆగ్ర‌హించారు. అవసర లేకపోయినా, ప్రత్యేక కేసుగా పరిగణించి, 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయల్డ్ రైస్ ను కొనేందుకు అంగీకరించామ‌ని.. కేంద్రం వద్ద ఇప్పటికే 4 ఏళ్ల నిల్వలు ఉన్నాయని వెల్ల‌డించారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమ‌ని… శనివారం నుంచి ఎదురుచూస్తున్నాం అని తెలంగాణ మంత్రులు, ఎంపీలు చెపుతున్నారని ఆగ్ర‌హించారు.నేను వాళ్లను రమ్మని ఆహ్వానించలేదన్నారు.  ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని.. సరఫరా చేస్తామన్న బియ్యమే ఇంతవరకు ఇవ్వలేదని మండిప‌డ్డారు.