రేషన్ సరుకుల్లో ప్లాస్టిక్ బియ్యం..

-

ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ సరుకుల్లో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అదిలాబాద్ జిల్లా హాజీపూర్ మండలంలోని వేంపల్లి రేషన్ దుకాణం లో చోటు చేసుకుంది. దుకాణంలో పలువురికి రేషన్ బియ్యం సరఫరా చేయగా ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లు గుర్తించి శనివారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ప్లాస్టిక్ బియ్యం వచ్చినట్లు స్థానికులు తహసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అధికారులు ముందే ప్లాస్టిక్ బియ్యాన్ని పలువురు గ్రామస్తులు కాల్చారు.

ఒకదానికి ఒకటి అతుక్కుపోయి ఉన్నట్లు గుర్తించారు.రేషన్ దుకాణం లోని 138 బస్టాండ్ లో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు అధికారులు . దీంతో వెంటనే వాటిని సీజ్ చేశారు. తాత్కాలికంగా రేషన్ పంపిణీ  నిలిపి వేయాలని ఆదేశించారు.  బిర్యాని పరీక్షలకోసం ల్యాబ్ కు పంపిస్తామని రుజువైతే దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రేషన్ దుకాణం డీలర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news