ప్లీజ్.. వాటిని ఆపేయండి.. బండ్ల గణేష్ రిక్వెస్ట్..?

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు అన్న విషయం తెలిసిందే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని లేని పక్షంలో తాను బ్లేడ్ తో గొంతు కోసుకుంటా అంటూ సవాల్ కూడా చేశాడు బండ్ల గణేష్. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ ఘోర ఓటమి చవి చూడటం తో… ఎంతోమంది బండ్ల గణేష్ ని సోషల్ మీడియా వేదికగా ఆడుకున్నారు కూడా. అయితే ఇక అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు బండ్ల గణేష్.

producer bandla ganesh posts his corona negative report

అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో గతంలో బండ్ల గణేష్ పెట్టిన పోస్టులు మరోసారి రీ పోస్ట్ చేస్తూ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్… తాను ప్రస్తుతం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.పాత పోస్టులు మళ్ళీ రీ పోస్ట్లు చేయకండి అంటూ అందరికీ రిక్వెస్ట్ చేసాడు బండ్లగణేష్.