కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనం కలగనుంది. కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ని కూడా ప్రవేశ పెట్టింది. ఈ స్కీమ్ వలన లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. రూ.2 వేల చొప్పున 12 విడతల్లో లక్షల కోట్లు రైతులకి ఇస్తున్నారు. 12 విడతల్లో లక్షల కోట్లు ఇప్పటికే పడ్డాయ్.
ఇక ఇప్పుడు 13వ విడత డబ్బులు రావాల్సి వుంది. ఈ నిధులు వచ్చే నెల లో హోలీ పండగకు ముందే జమ చేసేందుకు చూస్తున్నారు. అయితే ఈ డబ్బులని పొందాలంటే పీఎం కిసాన్ లబ్ధిదారులు తప్పనిసరిగా వారి బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ ని లింక్ చేసుకోవాలి. ఇ-కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం చెప్పింది. వివరాలని చూస్తే.. ఫిబ్రవరి 10వ తేదీ లోగా ఈ ప్రక్రియని పూర్తి చెయ్యాలి.
అప్పుడే తదుపరి విడత డబ్బులు పడతాయి. ఇ-కేవైసీ, బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి. తదుపరి ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు ఖాతాలో జమ అవ్వాలంటే ఆధార్ లింక్ చేయాలి గుర్తుంచుకోండి. కేవలం 67 శాతం మంది మాత్రమే ఇ-కేవైసీ పూర్తి చేసారు. 88 శాతం మంది బ్యాంకు ఖాతాతో ఆధార్ ని లింక్ చేసారు. పీఎం కిసాన్ స్కీమ్ కోసం వార్షిక బడ్జెట్ 2023-24లో రూ.60,000 కోట్లు కేటాయించింది కేంద్రం. పీఎం కిసాన్ ప్రారంభించినప్పటి నుంచి అత్యంత తక్కువ బడ్జెట్ ఇదే.