పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే.. జూలై 31 లోగా ఈ పని చేయాల్సిందే..

-

రైతుల శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో ఒకటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం..పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఏటా మూడు విడతల్లో రూ.6వేలు జమ చేస్తున్న సంగతి తెలిసిందే.కొందరు రైతులు ఈ-కేవైసీ చేయించుకోకపోవడంతో ఈ పథకం లబ్ది పొందలేకపోతున్నారు. ఈ-కేవైసీ చేసేందుకు జులై 31 వరకు గడువు ఉంది.

E-KYC ఎలా చెయ్యాలంటే..

* pmkisan.gov.in వెబ్ సైట్ కి వెళ్లి E-KYC ఆప్షన్ క్లిక్ చేయాలి.
* రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
* ఆధార్ కి లింక్ అయిన మొబైల్ కు వచ్చే ఓటీపీని నమోదు చేసి..
* సబ్మిట్ నొక్కితే సరిపోతుంది.

అది సక్సెస్ అని వస్తే సమస్య లేదు కానీ రాకుంటే మాత్రం దగ్గరలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లోనే కాదు ఆఫ్ లైన్ లోనూ రైతులు ఈకేవైసీ చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవడానికి కచ్చితంగా ఆధార్ కార్డుని వెంట తీసుకుని వెళ్లాలి. ఈ కేవైసీ చేసుకోవడాన్ని కేంద్రం తప్పనసరి చేసింది. వాస్తవానికి ఈకేవైసీ చేసుకోవడానికి గడువు మే 31తో ముగిసింది. అయితే కేంద్రం ఆ గడువుని మరో రెండు నెలలు పొడిగించింది.

పీఎం కిసాన్ స్కీమ్ కింద ఇప్పటి వరకు రైతులకు 11 విడతల డబ్బులు అందాయి. పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు సెప్టెంబర్ లో రావొచ్చని తెలుస్తోంది. అంటే ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు రూ.22 వేలు అందించింది. మరో రూ. 2 వేలు వస్తే.. ఒక్కో రైతుకు రూ.24 వేలు వచ్చినట్లు అవుతుంది..ఇకపోతే ఈ పథకం కింద అనర్హులు కూడా డబ్బులు పొందారని తెలుస్తుంది.అయితే వారు తీసుకున్న ఎమౌంట్ ను తిరిగి చెల్లించాలని అధికారులు తేల్చి చెప్పారు..

PM కిసాన్ పోర్టల్ https://pmkisan.gov.in/కి వెళ్లాలి. తర్వాత మీరు ‘రీఫండ్ ఆన్‌లైన్’ మీద క్లిక్ చేసి, అభ్యర్థించిన సమాచారాన్ని ఇక్కడ నింపాలి. ఆ తరువాత మీ 12 అంకెల ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను ఇక్కడ నమోదు చేయాలి. ఆ తర్వాత వచ్చే క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, ‘డేటా పొందండి’పై క్లిక్ చేయండి. దీని తర్వాత ‘యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏ రీఫండ్ అమౌంట్’ అనే సందేశం కనిపిస్తే, మీరు వాయిదా డబ్బును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు..రీఫండ్ అమౌంట్ వుంటే తిరిగి నగదును చెల్లించాలి..

Read more RELATED
Recommended to you

Latest news