ఏపీలో లోన్ యాప్స్ పేరుతో చీఫ్ ట్రిక్స్‌..వివాహిత న్యూడ్ ఫొటోస్ తో దారుణం

-

కృష్ణాజిల్లా అవనిగడ్డ లో లోన్ యాప్ వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఇండియన్ బుల్స్, రూపెక్స్ యాప్స్ ద్వారా 20,000 లోను తీసుకుంది ప్రత్యూష అనే మహిళ. 20 వేల లోనుకు రెండు లక్షల వరకు కట్టించుకున్న సైబర్ నేరగాళ్లు… ప్రత్యుషను ఇంకా డబ్బు కట్టవలసింది ఉంది అని కట్టకపోతే సెల్ఫీ ఫోటో ద్వారా న్యూడ్ ఫొటోస్ లింక్ చేసి పెడతామని బెదిరించారు. ఇందులో భాగంగానే వాట్సాప్ లో అసభ్యకరంగా మెసేజ్లు పంపారు సైబర్ నేరగాళ్లు.

దీంతో పరువు పోతుందనే భయంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది ప్రత్యూష. సెల్ఫీ వీడియో ద్వారా జరిగిన విషయం మొత్తాన్ని భర్త ఫోన్ కి పంపించి ఆత్మహత్య చేసుకున్న ప్రత్యూష… భర్తతో కలిసి గుంటూరు జిల్లా చిన్న కాకానిలో ఉంటుంది. నిన్న ఉదయం భర్త రాజశేఖర్ ఇంట్లో నిద్రిస్తూ ఉండగా బిల్డింగ్ పైన ఉన్న ఫ్లెక్సీ ఫ్రేమ్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ప్రత్యూష.

సైబర్ నేరగాళ్ల పై మంగళగిరి స్టేషన్లో కేసు ఫిర్యాదు చేశారు భర్త రాజశేఖర్. ఇక‌ ప్రత్యూష మృతదేహాన్ని భర్త స్వగ్రామమైన ఘంటసాల మండలం చిన్న కల్లేపల్లి గ్రామంకు తరలించారు కుటుంబ సభ్యులు. సైబర్ నేరగాళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు.

Read more RELATED
Recommended to you

Latest news