అన్నదాతలకు బ్యాడ్ న్యూస్… వారికి పీఎం కిసాన్ డబ్బులు రావు..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. అయితే కేంద్రం రైతుల కోసం కూడా పలు స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. రైతుల కోసం కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో పీఎం కిసాన్ కూడా ఒకటి. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా చాలా మంది రైతులు బెనిఫిట్ ని పొందుతున్నారు. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతులకు చేయూతనిస్తోంది కేంద్రం. ఏడాదికి రూ. 6,000 చొప్పున ఈ స్కీమ్ కింద రైతులు పొందొచ్చు.

farmers

మూడు వాయిదాలలో రూ.2,000 చొప్పున రైతుల అకౌంట్ లో ఈ డబ్బులు పడతాయి. కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12వ విడత నిధులను విడుదల చేసారు. అయితే ఈ స్కీమ్ లో భాగంగా ఇప్పటి దాకా 10 కోట్ల మందికి పైగా రైతులకు ఈ డబ్బులు వచ్చాయి. అయితే ఇక ఇప్పుడు 13వ విడత డబ్బులు రావాల్సి వుంది. కానీ వీరికి మాత్రం ఆ డబ్బులు రావు.

భూ ధృవీకరణ పత్రాలు, e-KYCని కచ్చితంగా రైతులు పూర్తి చెయ్యాలి. అలా చెయ్యకపోతే 13వ విడత డబ్బులు అందవు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో 27,43,708 మంది రైతులు ఈ స్కీమ్ కింద డబ్బులని పొందుతున్నారు కానీ తదుపరి విడత 19,75,340 మంది రైతులు మాత్రమే పొందగలరట. 13వ విడత నగదు పొందాలంటే రైతులు కచ్చితంగా భూ ధృవీకరణ ఈ-కేవైసీ ని పూర్తి చేయాలి. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్టేటస్ ని తెలుసుకోవాలంటే 155261కి కాల్ చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news