మొన్ననే కర్ణాటక ఎన్నికల సంఘం ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ జయభేరి మోగించింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి కర్ణాటక ప్రజలు ఓట్లతో బుద్ది చెప్పారు. కాగా బీజేపీ తరపున ఈ ఎన్నికలలో సెంట్రల్ నుండి లీడర్స్, పీఎం మోదీ మరియు సినీ నటులు కూడా ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. కాగా తాజాగా మోదీ రోడ్ చేసిన మార్గాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు గో మూత్రం తోనూ మరియు పేడతోనూ శుభ్రం చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గత నెల 30వ తేదీన మోదీ మైసూర్ లో భారీ రోడ్ షో ను నిర్వహించడం జరిగింది. మాములుగా అయితే మోదీ రోడ్ చేసిన మార్గం దసరా పండుగ సమయంలో అంబారీ వెళ్లే మార్గం అన్నమాట.
మోదీ రోడ్ చేసి అపవిత్రం అయిందని భావించిన అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు ఆ మార్గం మొత్తాన్ని పేడనీళ్లతో మరియు గో మూత్రంతో పరిశుభ్రం చేశారు. ఇది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది, బహుశా ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఉంటే ఇలాంటి పరిణామాలు జరిగేవి కాదేమో.