హార్మోన్ల: 9 నెలలు కూడా గర్భిణీలు ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు అంతా అయిపోయిందనుకునే సరికి బిడ్డ పుట్టిన తర్వాత మరి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏది ఏమైనా గర్భిణీలు బిడ్డకు జన్మనిచ్చిన తల్లులు జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల తప్పక శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం పాడైతే మళ్లీ దానిని మనం తిరిగి పొందలేము. అయితే కొత్తగా బిడ్డకి జన్మనిచ్చిన తల్లుల్లో ఇలాంటి మార్పులు కనబడుతూ ఉంటాయి… ఎలాంటి మార్పులు వలన ఇబ్బంది పడాల్సి వుంది అనేది తెలుసుకోవాలి. మరి ఇక కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లుల్లో ఎటువంటి మార్పులు కలుగుతాయి అనేది చూద్దాం.
ముఖ్యంగా శరీరంలో ఎన్నో రకాల మార్పులు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లుల్లో కలుగుతూ ఉంటాయి. నార్మల్ డెలివరీ అయిన తల్లుల్లో నొప్పి వాపు వంటివి వారం రోజులు పాటు ఉంటాయి. సీ సెక్షన్ అయిన తల్లుల్లో కొంచెం ఎక్కువ రోజులు ఇబ్బంది ఉంటుంది హార్మోనల్ మార్పులను కూడా తల్లుల్లో గమనించొచ్చు ఆస్ట్రోజన్ ప్రొజెస్టరోన్ లెవెల్స్ లో మార్పులు డెలివరీ తర్వాత కలుగుతూ ఉంటాయి.
హార్మోనల్ మార్పులు వల్ల మూడు స్వింగ్స్, నీరసం, ఇరిటేషన్, డిప్రెషన్ వంటివి ఉంటాయి అయితే నిజానికి హార్మోనల్ చేంజెస్ అయినప్పుడు వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. వాళ్లని ఇష్టపడే వాళ్ళు ప్రేమని చూపిస్తూ ఉండాలి అలానే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లిపాల వలన బ్రెస్ట్ లో వాపులు వంటివి వాళ్ళలో కలుగుతూ ఉంటాయి. అలానే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్ గా అయిపోతూ ఉంటాయి. బౌల్ మూమెంట్స్ లో కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది.
బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత విపరీతమైన బ్లీడింగ్ చెస్ట్ లో నొప్పి ఇన్ఫెక్షన్స్ ఇలా రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఇటువంటి సమయంలో మంచి ఆహారం తీసుకోవడం సరైన మందుల్ని ఉపయోగించడం తో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం ఇలాంటి మార్పులు ఉన్నప్పుడు తల్లులు జాగ్రత్తగా ఉండాలి.