ఉల్లిపాయలను కట్‌ చేసి చాలా సేపు ఉంచితే విషపూరితమవుతాయా..?

-

ఉల్లిపాయలను: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు.. అది కరక్టుగా వాడకపోతే.. ఉల్లి పెట్టే లొల్లి అంతా ఇంత కాదు..ఉల్లిపాయలను సరైన మోతాదులో సరైన కాంబినేషన్‌తోనే తినాలి.. దేంతో పడితే దాంతో ఉల్లిని కలిపి తినకూడదు.. ఉల్లిపాయలు ఎక్కువగా వాడే పులుసు కూరలు అదేపనిగా తింటే గ్యాస్‌ సమస్య.. సరే ఇదంతా పక్కనపెడితే.. జనాలు ఎప్పుడూ ఏదో ఒక గందరగోళంలో ఉంటారు.. పది మంది నమ్మితే.. ఆటోమెటిక్‌గా పదకొండో వ్యక్తి కూడా అది నిజం అనే నమ్ముతాడు.. ఈ క్రమంలోనే చాలా మంది.. ఉల్లిపాయను కట్‌ చేసిన తర్వాత ఎక్కువ సేపు అలా ఉంచితే అవి విషపూరితం అవుతాయని బలంగా నమ్ముతున్నారు.. ఇందులో నిజం ఎంత..? నిజంగానే అవి అంత డేంజరా..?

 

ఉల్లిపాయ‌ల‌ను క‌ట్ చేసి అలాగే చాలా సేపు ఉంచితే విషపూరితంగా మారుతాయ‌ని, అందువ‌ల్ల వాటిని క‌ట్ చేశాక వెంట‌నే వాడాల‌ని.. చాలా మంది ఇప్ప‌టికీ న‌మ్ముతున్నారు. అయితే దీని గురించి సైంటిస్టులు ఏం అంటున్నారంటే.. ఉల్లిపాయ‌ల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. వాటిని క‌ట్ చేశాక సూక్ష్మ జీవుల‌పై పోరాటం చేస్తాయి. కానీ విష‌పూరితంగా మార‌వు. కాబ‌ట్టి ఉల్లిపాయ‌ల‌ను క‌ట్ చేశాక చాలా సేపు ఉంచితే అవి విష‌పూరితంగా మారుతాయి అనేది అబద్ధం మాత్రమే అని సైంటిస్టులు అంటున్నారు.

ఉల్లిపాయ‌ల‌ను క‌ట్ చేసి చాలా సేపు ఉంచితే అవి విష పూరితంగా మారుతాయ‌ని అన‌డంలో ఎంత మాత్రం నిజం లేద‌ని, అంతా అబ‌ద్ద‌మని, ఇంట‌ర్నెట్‌లో ఇలాంటి పుకార్లు చాలా వ‌స్తున్నాయ‌ని, వాటిని న‌మ్మాల్సిన ప‌నిలేద‌ని అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు అన్నారు.

ఉల్లిపాయ‌ల‌ను క‌ట్ చేసి వాటిని నేరుగా ఫ్రిజ్‌లో గానీ, ఇత‌ర ఆహారాల వ‌ద్ద గానీ పెట్ట‌రాదు. ఉల్లిపాయలను కట్‌ చేసి అలానే ఫ్రిడ్జ్‌లో పెడితే ఆ వాసన ఫ్రిడ్జ్‌ అంతా వ్యాపిస్తుంది. అలా పెడితే ఆ ఆహారాలు త్వ‌ర‌గా పాడ‌వుతాయి. ఉల్లిపాయ‌ల‌ను క‌ట్ చేశాక వాటిని ఒక సీల్డ్ క‌వర్‌లో ఉంచాలి. అనంత‌రం ఆ క‌వ‌ర్‌ను ఫ్రిజ్‌లో పెట్ట‌వ‌చ్చు. దీంతో ఉల్లిపాయ‌లు 7 రోజుల వ‌ర‌కు తాజాగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news