వంటనూనెలు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాం : పీఎం మోడీ

-

నీతి ఆయోగ్​ పాలక మండలి సమావేశం ఢిల్లీలో జరిగింది. అయితే ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పంటల వైవిధ్యంపై దృష్టి సారించాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు నరేంద్ర మోదీ. నూనె గింజలు (వంటనూనెలు) ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు మోదీ. కొవిడ్​ సంక్షోభం సమయంలో.. భారత సహకార సమాఖ్యవాదం, సమాఖ్య నిర్మాణం ప్రపంచ దేశాలకే నమూనాగా నిలిచిందని అన్నారు మోదీ. ఢిల్లీ రాష్ట్రపతి భవన్​ సాంస్కృతిక కేంద్రంలో మోదీ అధ్యక్షతన జరిగిన భేటీకి పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్​ గవర్నర్లు హాజరయ్యారు.

PM Modi chairs NITI Aayog meet with chief ministers| 10-point lowdown |  Latest News India - Hindustan Times

సమావేశం ఫలప్రదంగా జరిగిందని అన్నారు నీతి ఆయోగ్​ సీఈఓ పరమేశ్వరన్​ అయ్యర్​. ఎన్​ఈపీ 2020, జీ 20, ఎగుమతుల ప్రాధాన్యంపై చర్చ జరిగిందని అన్నారు.కొవిడ్​ సమయంలో రాష్ట్రాల మధ్య సహకారం గురించి మోదీ మాట్లాడారని వెల్లడించారు నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​ సుమన్​ బేరీ. 2047 లక్ష్యాల గురించి ప్రధాని కీలకంగా మాట్లాడారని పేర్కొన్నారు. నూతన విద్యావిధానంపైనా దాదాపు అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని అన్నారు నీతి ఆయోగ్​ సభ్యులు వీకే పాల్​. రాబోయే రోజుల్లో ఇది అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.పప్పు ధాన్యాల ఉత్పత్తిలో గడిచిన ఐదారేళ్లలో గణనీయమైన పురోగతి సాధించినట్లు నీతి ఆయోగ్​ సభ్యుడు రమేశ్​ చంద్ వెల్లడించారు​.

 

Read more RELATED
Recommended to you

Latest news