తెలంగాణ పేరు చెప్పి ఏ రకమైన పరిపాలన చేస్తున్నారు : కిషన్‌రెడ్డి

-

సీఎం కేసీఆర్‌ నీతి ఆయోగ్‌ పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్‌ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్పందిస్తూ.. దేశాభివృధ్ధి కోసం చర్చించే అద్భుత వేదిక నీతి ఆయోగ్ మీటింగ్ అని.. కేసీఆర్ నీతి ఆయోగ్ మీటింగ్ కు రాకపోవటం సరయింది కాదని మండిపడ్డారు కిషన్‌రెడ్డి. మీకు మీటింగ్ కు రావటం ఇష్టం లేక పోతే.. రాకండి.. ప్రధానిని కలవటం మీకు ఇష్టం లేకపోతే ఫార్మ్ హౌస్ లోనో ప్రగతి భవన్ లోనో ఉండండని సెటైర్లు వేశారు కిషన్‌రెడ్డి. కడుపులో నొప్పికి తలనొప్పి అని చెప్తున్నట్లు ఉన్నాయి కేసీఆర్ వాఖ్యలు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి ఏ రకమైన పరిపాలన చేస్తున్నారని, తెలంగాణ లో బీజేపీ బలపడేంత వరకు కేంద్ర ప్రభుత్వం మంచిదని, రాష్ట్రంలో బీజేపీ బలపడ్డాక వాళ్ళ కుటుంబం నుంచి అధికారం కోల్పోతామనే బాధతో, మోడీపై కేంద్ర ప్రభుత్వం పై విషం ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు కిషన్‌రెడ్డి.

Kishan Reddy's remarks on Agniveers raise eyebrows

దళిత ముఖ్యమంత్రి ని చేస్తామన్నారు ఎందుకు చేయలేదని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని, కేంద్రం ఇళ్ల నిర్మాణం కోసం ఓపెన్ ఆఫర్ పెట్టిందని, తెలంగాణ లో టీఆర్‌ఎస్‌ వాళ్లకే ఇల్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గద్దె దిగే వరకు ఆయన హామీలు ప్రజలకు గుర్తు చేస్తామని, 15 మంత్రిత్వ శాఖలు కల్వకుంట్ల గుప్పిట్లో ఉన్నాయన్నారు. తెలంగాణ లో ప్రజాస్వామ్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news