నిన్న చంద్రబాబు సభలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు అధ్యక్షతన ఓ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో అపశృతి చోటు చేసుకుంది. బహిరంగ సభ దగ్గర తొక్కిసలాట ఏర్పడడంతో 8 మంది మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయాల పాలైన వారి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట జరగడంతో వెంటనే పక్కనే ఉన్న కాలువలో పలువురు కార్యకర్తలు పడిపోయారని తెలుస్తోంది. అలా పడిపోయిన వారికి గాయాలు కాగా 8 మంది మృతి చెందారు. అయితే, మృతి చెందిన కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోడీ… అండగా నిలిచారు. పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తామని ప్రకటించారు ప్రధాని మోడీ.
పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు,క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తాం : పిఎం @narendramodi
— PMO India (@PMOIndia) December 29, 2022