ప్రధాని మోదీకి వచ్చిన గిఫ్టుల వేలం.. ఎప్పుడంటే..?

-

మనకు నచ్చిన వారికి బహుమతులు ఇవ్వడం చాలా మందికి ఉండే అలవాటు. ముఖ్యంగా తమ ఫేవరెట్ హీరో, క్రికెటర్స్.. ఇలా సెలబ్రెటీలకు కూడా బహుమతులు పంపిస్తూ ఉంటారు. అలా ప్రధాని నరేంద్ర మోదీకి కూడా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు చాలా మంది అభిమానంతో చాలా రకాల గిఫ్టులు పంపిస్తుంటారు. అయితే ఈ గిఫ్టులను అలాగే ఉంచకుండా వేలం వేసి ఆ డబ్బును ప్రజాసంక్షేమం కోసం వినియోగిస్తూ ఉంటుంది పీఎంఓ. అలా మోదీకి వచ్చిన 1200లకు పైగా వస్తువులను సెప్టెంబర్ 17 నుంచి వేలం వేయనున్నారు.

ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగ మిషన్‌కు అందజేస్తారు. ఈ వేలం ప్రక్రియ pmmementos.gov.in అనే వెబ్‌పోర్ట్‌ ద్వారా నిర్వహించనున్నట్టు మోడ్రన్‌ ఆర్ట్‌ నేషనల్‌ గ్యాలరీ డీజీ అద్వైత గదనాయక్‌ వెల్లడించారు. మోదీ కానుకల వేలం అక్టోబర్‌ 2తో ముగుస్తుందని, వీటి ప్రారంభధర రూ.100 నుంచి 10లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ బహుమతుల్లో  క్రీడాకారులు, రాజకీయ నేతలు సహా వివిధ వర్గాలు ఆయన్ను కలిసిన పలు సందర్భాల్లో ఇచ్చినవి ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news