విద్యుత్ బకాయిలు ఎగ్గొట్టడానికి తెలంగాణ యత్నం : పెద్దిరెడ్డి ఫైర్

-

తెలంగాణ సర్కార్‌ పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి ఏపీకి ఆరు వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది. దీనిపై పోరాడుతున్నామన్నారు. ఈ బకాయిలు ఎగ్గొట్టడానికే 1700 కోట్లు మాకే ఇవ్వాలని తెలంగాణ సర్కారు నిన్న కోర్టును ఆశ్రయించింది…. లీగల్ గా ఎదుర్కొంటామని హెచ్చరించారు.

ఈ నెల 22న సీఎం జగన్ కుప్పం వస్తున్నారు. మూడవ విడత చేయూత పథకంను సీఎం ఇక్కడ లబ్ధిదారులకు విడుదల చేస్తారని వివరించారు. ఇసుకపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు…ఇసుక కేటాయింపు పారదర్శకంగా జరుగుతోంది….ఇసుక కాంట్రాక్ట్ దక్కించుకున్న వారు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వచ్చు. దీనితో ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు.

ఇసుక విషయంలో అక్రమాలు అరికట్టేందుకు విజిలెన్స్ విభాగం పటిష్టంగా పనిచేస్తోందని.. ప్రభుత్వ షాదీ తోఫా ప్రకటనను పక్కదారి పట్టించేందుకే ఇలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 100 శాతం ఎన్నికల హామీలు అమలుచేస్తున్నది సీఎం జగన్ సర్కారని.. ఢిల్లీ లిక్కర్ స్కాం తో ఏపి ప్రభుత్వం కు సంబంధం లేదని చెప్పారు. వైఎస్ భారతమ్మ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news