మహారాష్ట్ర ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోదీ దిగ్భ్రాంతి..!

-

రాయ్‌గ‌ఢ్ జిల్లాలో జరిగిన భ‌వ‌న ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఆయన ట్విట్ట‌ర్‌‌ వేదికగా ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికారులు బాధితుల‌కు అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నార‌ని ఈ సందర్బంగా మోదీ పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం ఇంకా సహాయక చర్యలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని ఎన్డీఆర్ఎఫ్ డీజీని ఆదేశించినట్టు తెలిపారు.

ఎన్డీఆర్ఎఫ్ బృందాలు త్వరలో అక్కడికి చేరుకున్నాయని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్ధించారు. కాగా, మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా మహద్‌లోని 5 అంతస్తుల భవనం నిన్న కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 2 మృత దేహాలు దొరకగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 200 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానిక మంత్రి వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నాయి. ఇప్పటివరకు సిబ్బంది 60 మందినిపైగా రక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news