ఎల్బీనగర్-సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వైపు.. మియాపూర్ నుంచి రామచంద్రాపురం వైపు మెట్రో సేవలను పొడగిస్తామని సీఎం తెలిపారు. రానున్న వందేళ్ల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కి సహకరించొద్దని ఓ పెద్దాయన చెప్పారు. అలా మరోసారి చేస్తే నగర బహిష్కరణ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైనటువంటి ఎల్బీనగర్, హయత్ నగర్ వంటి ప్రాంతాల్లో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా వాసులు అధికంగా ఉంటారని తెలిపారు. ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వందేళ్ల వరకు హైదరాబాద్ అభివృద్ధి చెందేలా కృషి చేయనున్నట్టు తెలిపారు.