జనగామ నుంచి అసెంబ్లీ బరిలో ఎమ్మెల్సీ పోచంపల్లి ?

-

జనగామ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తారని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే..దీనిపై ఆయనే క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనగామ నుండి పోటీ చేస్తా అని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. 12 నియోజకవర్గాలకు ఎమ్మెల్సీగా గెలుపొందాను.. అందరి బాగోగులు చూసే వ్యక్తినని.. జనగామ ఎమ్మెల్యే టికెట్ రేసులో తాను ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు అది దుష్ప్రచారం మాత్రమేనని పేర్కొన్నారు.

అధిష్టానం దగ్గర వ్యక్తిగా.. పార్టీ ఆదేశాల మేరకు జనగామలో ఇన్ చార్జిగా పనిచేశానని.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నాయకత్వంలో జనగామ నియోజకవర్గ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.

గత 20 ఏళ్లుగా సీఎం కేసీఆర్ తో వెంట నడుస్తూ…అదే క్రమంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో సైతం తనకు అనుబంధం ఉందని… రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కి తన సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు. జనగామ నియోజకవర్గంలో తాని పోటీ చేస్తున్నట్లు వస్తున్న ప్రచారం ఎవరూ కూడా నమ్మవద్దని కోరారు. హైదరాబాదులో జూన్ 2, 3 వ తేదీల్లో జరిగే బీజేపీ జాతీయ సమావేశాలకు వచ్చే ఆ పార్టీ ముఖ్య నాయకులు, ఆయా రాష్ట్రాల సీఎంలను టూరిస్టులుగా అని భావిస్తున్నామని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news