మైనర్ బాలికపై లైంగిక దాడి.. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధిపై పోక్సో కేసు

-

నిర్మల్ జిల్లాలో ఒక మైనర్ బాలికపై టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి లైంగికదాడికి ఒడిగట్టారు. అయితే ఈ కేసులో ఆ ప్రజాప్రతినిధి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైయస్సార్ నగర్ ఆర్ కాలనీ కి చెందిన ఓ మైనర్ బాలికపై టిఆర్ఎస్ పార్టీకి చెందిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ క్రమంలోనే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలికపై గత కొన్ని రోజుల నుంచి సాజిద్ అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. ఆమెను బెదిరించి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు కూడా సమాచారం అందుతోంది.

ఇలాంటి తరుణంలోనే నిన్న సాయంత్రం నిర్మల్ గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలో బాధితురాలు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… బాలికను సఖి సెంటర్ కు తరలించి దర్యాప్తు చేపట్టారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి సాజిద్ ఖాన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు జైల్లో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news