అత్యాచారం, హత్యకు గురైన దిశ సంఘటనలో సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ పెద్ద ట్వీస్ట్ ఇచ్చారు. దిశ ను అత్యాచారం చేసి హత్య చేసిన ప్రదేశంలోనే నిందితులుకు ఎన్‌కౌంటర్‌కు గురికావడం విశేషం. పోలీసులు నలుగురు నిందితులను కష్టడిలోకి తీసుకుని సంఘటన స్థలంకు తీసుకెళ్ళి విచారణ చేస్తున్న సందర్భంలో నిందితులు తిరుగుబాటు చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు చెపుతున్నారు. కోర్టు నుంచి నిందితులను పోలీసులు తమ కష్టడిలోకి తీసుకున్నతరువాత దిశ కేసును ఛేదించే క్రమంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
దిశ సంఘటన తీరుతెన్నులను తెలుసుకునేందుకు స్పెషల్ పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న క్రమంలో నిందితులు అదును చూసి పారిపోయే ప్రయత్నంలో ఉండగా పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నలుగురు హంతకులు హతమయ్యారు. దిశ ను అత్యాచారం జరిపి, ఆపై హత్య చేసి, దహనం చేశారు. అయితే ఈ సీన్ జరిగిన తీరును సేకరించే పనిలో పోలీసులు ఉండ మహ్మద్, బొల్లు నవీన్, బొల్లు శివ, చెన్న కేశవులు నలుగురు ఒకేసారి పోలీసులపై తిరుగబడి పోలీసుల వద్ద ఉన్న తుపాకులను లాక్కుని కాల్పులు జరిపుతూ పారిపోయే క్రమంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారని సమాచారం.
అయితే సైబరాబాద్ పోలీసులు దిశను అత్యాచారం చేసి, హత్య చేసిన ప్రదేశంలో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం విశేషం. ఈ ఎన్‌కౌంటర్ రాత్రి 3.30గంటల ప్రాంతంలో జరిగిందని సమాచారం. అయితే ఎక్కడైతే దిశను చంపారో అక్కడే నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. సంఘటన జరిగిన 9రోజుల్లోనే నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. షాద్‌నగర్ ప్రాంతంలోని చటాన్‌పల్లి వద్ద ఈ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న క్రమంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
బ్రిడ్జి సమీపంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరగడం పట్ల దిశకు సరైన న్యాయం జరిగిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దిశ సంఘటనలో పాల్గొన్న నిందితులు ఎన్‌కౌంటర్ కావడం పట్ల దేశం మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు ఈ కేసులో ఎంతో చాకచక్యంగా, ముందస్తు వ్యూహం ప్రకారం కేసును ఛేదించే క్రమంలో ఈ సంఘటన జరిగిందనే సమాచారం. దిశ నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురికావడంతో ఇప్పుడు దిశ లాంటి సంఘటనలు జరుగకుండా కొంత చెక్ పెట్టినట్లే.