గుంటూరులో మర్డర్ ప్లాన్ భగ్నం చేశారు నగరంపాలెం పోలీసులు. రెండు రోజులక్రితం నల్లపాడు కలర్స్ పార్క్ అపార్ట్‌మెంట్ సూపర్‌వైజర్ ప్రశాంతితో గొడవపడ్డాడు పవన్ అనే యువకుడు. పవన్, సూపర్ వైజర్ ప్రశాంతిల గొడవలో జోక్యం చేసుకున్నారు అపార్ట్‌మెంట్ లో నివాసం ఉంటున్న ఆరిఫ్ బాషా, మరో ముగ్గురు. ఆ సమయంలో సూపర్‌వైజర్ తో గొడవ పడిన పవన్ పై చేయిచేసుకున్నారు నలుగురు వ్యక్తులు. తనపై దాడి చేసిన వారిని హత్య చెయ్యాలంటూ స్నేహితులను కోరాడు పవన్.
ఏటీ అగ్రహారంలో రౌడీషీటర్ చంద్రరాజేష్ సహకారం కోరారు పవన్ స్నేహితులు. రౌడీషీటర్ చంద్రరాజేష్ ఇంట్లో హత్యకు స్కెచ్ వేస్తుండగా.. పక్కా సమాచారంతో రౌడీషీటర్ చంద్రరాజేష్ ఇంటిపై పోలీసుల దాడులు నిర్వహించారు. రౌడీషీటర్ ఇంట్లో కత్తులతో ఉన్న రవితేజ, ధనుష్, వీరబాబులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులను చూసి పరారైయ్యారు పవన్, రాజేష్, బాలకోటేశ్వరావులు. రౌడీ షీటర్ చంద్ర రాజేష్ ఇంట్లో ఐదు కత్తులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పరారైనవారికోసం పోలీసుల గాలింపులు చేపడుతున్నారు.