పోలీసులు రుబాబు : అర్ధరాత్రి అబ్దుల్ అత్త ఇంటికి వెళ్లి !

-

కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసులు వేధింపులతో అబ్దుల్ సలాం తన ఇద్దరు పిల్లలు భార్య తో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి కారణం పోలీసులు అంటూ ఆయన మరణానికి ముందు రికార్డు చేసిన ఒక సెల్ఫీ వీడియో బయటికి రావడంలో ఇప్పుడు అది వివాదాస్పదంగా మారింది. దీంతో ఇప్పటికే దీనికి కారణంగా భావిస్తున్న సీఐని అలానే ఒక హెడ్ కానిస్టేబుల్ ని పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది.

అలానే వారిని అరెస్టు కూడా చేయగా కోర్టు వారికి బెయిల్ ఇచ్చింది. అయితే నేను రాత్రి పొద్దు పోయాక అబ్దుల్ సలాం అత్త దగ్గరకు పోలీసులు వెళ్లి తెల్ల కాగితం మీద సంతకం చేయాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోని అబ్దుల్ సలామ్ అత్తా సబ్ కలెక్టర్ కల్పనా కుమారికి ఫోన్ చేసినట్లు సమాచారం. అప్పటి కప్పుడు సబ్ కలెక్టర్ పోలీసులు తిరిగి ఫోన్ చేసి మందలించడంతో పోలీసులు వెనక్కి వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం దాన్ని కవర్ చేసుకునే పనిలో పడ్డారు. వారి బ్యాంకు వివరాల కోసమే వెళ్లాము అని చెబుతున్నారు. అయితే అంత అర్ధరాత్రి సమయంలో వెళ్లాల్సిన అవసరం ఏమిటి ముస్లిం సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news