రాధేశ్యామ్: ఒక్క సీన్ కి అన్ని కోట్లా..?

నేషనల్ స్టార్ ప్రభాస్ నుండి వస్తున్న ప్రేమకథా చిత్రం రాధేశ్యామ్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటలీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం చివరి దశకి వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో హైదరాబాద్ రానున్నారని సమాచారం అందుతుంది. ఐతే హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కించనున్నారట. రాధేశ్యామ్ పూర్తిగా ప్రేమకథా చిత్రం అని అందరికీ తెలుసు. కానీ ఇందులో ఒకే ఒక్క యాక్షన్ సీన్ ఉంటుందని ప్రభాస్ చెప్పాడు.

ఆ యాక్షన్ సీక్వెన్స్ ని హైదరాబాద్ లోనే చిత్రీకరించనున్నారట. అందుకోసం దాదాపుగా 30కోట్లు ఖర్చు పెడుతున్నారని అంటున్నారు. ప్రభాస్ కి మాస్ అభిమానులు చాలా ఎక్కువ. వారందరి కోసం ఈ సీన్ ని మరో లెవెల్ లో చూపించనున్నారట. అంతా పూర్తి చేసుకుని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నారట. రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు.