రోడ్దు మీద బస్సాపి మరీ దొంగతనం చేసిన ఏనుగు..

-

ఏనుగు దొంగతనం చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. అవును. మీరు చదివింది నిజమే. రోడ్డు మీద వెళ్తున్న బస్సును ఆపి మరీ అందులో నుండి అరటిపళ్ళను దొంగతనం చేసిన సంఘటన అందరికీ షాకింగ్ గా అనిపించింది. డ్రైవర్ ని కారు కదపనివ్వకుండా తొండాన్ని భుజాన వేసి, అతని పక్కన ఉన్న అరటి పళ్ళని దొంగిలించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ మేరకు ఐఎఫ్ ఎస్ అధికారి పర్వీన్ కాశ్వాన్ ట్విట్టర్ లో షేర్ చేసారు.

ఐతే ఏనుగులు ఈ విధంగా చేయడానికి కారణం మనుషులు చేసిన పనే అని చెబుతున్నాడు. సాధారణంగా అడవుల్లో తిరిగే జంతువులకి బయట రుచి తెలియదు. రోడ్డు మీద కనిపించే జంతువులకి అరటి పళ్ళు ఇంకా ఇతర ఆహారా పదార్థాలు వేయడం వల్ల అవి కొత్త రుచులకి అలవాటు పడతాయని, అందువల్ల రోడ్డు మీద కనిపించే జంతువులకి తినుబండారాలు వేయకూడదని పేర్కొన్నారు. అలా వేస్తూ వెళితే అవి అడవి రుచిని కోల్పోతాయని, ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news