రేపటి నుంచి కర్ణాటకలో అసెంబ్లీ సమావేశాలు.. బెళగాంలో భద్రతా దళాల మోహరింపు

-

కర్ణాటక-మహరాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఇరు రాష్ట్రాల మధ్య రవాణా పోలీసుల బందోబస్తు మధ్య జరుగుతోన్న పరిస్థితులే ఉన్నాయి. బెళగాం తమకంటే తమకంటూ ఇరు రాష్ట్రాలు ఆందోళనలు చేస్తున్న తరుణంలో బెళగాంలో రేపటి నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి.

కర్ణాటక శాసనసభ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు బెళగాంలో నిర్మించిన కొత్త అసెంబ్లీ భవనంలో జరుగనున్నాయి. బెళగాం మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం, ఇక్కడే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉద్రిక్త వాతావారణం నెలకొన్నది. బెళగాం, ఖానాపూర్‌, నిప్పాణి, నందగడ్‌, కార్వార్‌ సరిహద్దు విషయంలో మహారాష్ట్ర-కర్ణాటక రాష్ట్రాల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news