వైఎస్ షర్మిలను ఉస్మానియాకు తరలించనున్న పోలీసులు

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో కారుతో హల్చల్ చేశారు. పోలీసుల కళ్ళు కప్పి లోటస్ పాండ్ నుంచి సోమాజిగూడ చేరుకున్న వైయస్ షర్మిల.. సోమాజిగూడ నుండి ప్రగతి భవన్ కి వెళ్లేందుకు ప్రయత్నించింది. నిన్న దాడిలో అద్దాలు పగిలిన కారుని స్వయంగా నడుపుకుంటూ వచ్చిన షర్మిల వాహనాన్ని అడ్డుకున్నారు పోలీసులు.

దీంతో రోడ్డుపైనే వాహనాన్ని నిలిపిన షర్మిల కారు నుంచి బయటకి రాలేదు. పోలీసులు బయటకు రావాలని కోరినప్పటికీ తాను ప్రగతి భవన్ కి వెళతానని షర్మిల పట్టుబట్టింది. కార్ డోర్లు లాక్ చేసుకుని లోపల ఉండిపోయింది షర్మిల. దీంతో చేసేదేమీ లేక షర్మిల కారు లోపల ఉండగానే క్రేన్ సహాయంతో వాహనాన్ని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ కారు డోర్స్ బ్రేక్ చేసి షర్మిలను పోలీస్ స్టేషన్ లోకి తరలించారు.

ఇక షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. షర్మిలను ఉస్మానియాకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యలు చేపడుతున్నారు. వైద్య పరీక్షల తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుచనున్నారు. కాగా ఇప్పటికే షర్మిల పిఆర్ఓ శ్రీనివాస్ ను రిమాండ్ కు తరలించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news