సీఎం జగన్ హైకోర్టును ఎలా మారుస్తారు : దేవినేని ఉమా

-

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు కు సంబంధించిన అంశం మరోసారి రాజుకున్న విషయం తెలిసిందే. నిన్న 3 రాజధాని లకు సంబంధించిన బిల్లుపై.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడంతో ఆంధ్ర రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిడిపి నేతలు అందరూ దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా టీడీపీ కీలక నేత దేవినేని ఉమా మూడు రాజధానులు పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజధానిలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని అసమర్థులు 3 రాజధాని లను ఎలా నిర్మిస్తారో అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖలో 30 వేల ఎకరాలు అమ్మకాలు జరుపుకోవడానికి వ్యాపారపరంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేయబడిన హైకోర్టును.. 32 సీబీఐ ఈడి కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ ఎలా మారుస్తారు అంటూ ప్రశ్నించారు దేవినేని ఉమా. న్యాయస్థానాల్లో న్యాయం గెలుస్తుంది అంటూ వ్యాఖ్యానించిన దేవినేని ఉమా రాష్ట్ర రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అంటూ పేర్కొన్నారు,

Read more RELATED
Recommended to you

Latest news