యువ రాజు రాహుల్ గాంధీ ఇవాళ పంజాబ్ రాష్ట్రం లుథియానాకు వస్తున్నారు. రావడం రావడంతోనే రావణ కాష్టకు ముగింపు పలకాలని అనుకుంటున్నారు. ఓ యుద్ధం ముగించి మరోయుద్ధం ప్రారంభించాలని యోచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం ఎవరు అన్న దానిపై ఇవాళ ఓ క్లారిఫికేషన్ ఇవ్వనున్నారు. దీంతో ఇరు వర్గాలుగా ఉంటూ రోజు కొట్టుకు ఛస్తున్న సిద్ధూ మరియు చరణ్ సింగ్ ఇవాళ రాహుల్ మాట వింటారని అనుకోవడంతో పంజాబ్ కాంగ్రెస్ లో రేగిన ముసలం ఆగిపోతుంది అని భావించడం మన వంతు!
ఎన్నికలు జరగలేదు. ఫలితాలు రాలేదు కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న రణ రంగ పూరిత వార్త మాత్రం ప్రధాన మీడియాలో రొటేట్ అవుతోంది. హల్ చల్ చేస్తోంది. ఇవాళ పంజాబ్ సీఎం (భవిష్య కాలానికి సంబంధించి) ఎవరు అన్నది తేలిపోతుంది. అటుపై సిద్ధూ కానీ మరొకరు కానీ పార్టీ అధిష్టానం చెప్పిన నిర్ణయం ప్రకారం పనిచేస్తారు. ఇలాంటివేవో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అనుకోవాలి. లేకపోతే వివాదాలు ఆగిపోతాయి అని భావించడమే మీడియా వంతు మరియు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వంతు.
పంజాబ్ తగాదా అన్నది కాంగ్రెస్ వరకూ చాలా పాత తగాదా.అక్కడ ఎవరు గెలిచినా సీఎం అభ్యర్థి ఎవరు అయినా కూడా కాంగ్రెస్ మాత్రం తనదైన రాజకీయం ఒకటి నడుపుతూనే ఉంటుంది. పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ కు, నిన్న మొన్నటి వేళ సీఎం కుర్చీ దిగిపోయిన చరణ్ జిత్ సింగ్ చన్నీ మధ్య వివాదం నడుస్తూనే ఉంటుంది. వివాదాన్ని ఆధారంగా చేసుకుని ఎప్పటికప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఇరువురినీ పిలిచి మాట్లాడుతూనే ఉంటుంది. కానీ సమస్య మాత్రం ఎప్పటికప్పుడు నెలకొంటూనే ఉంటుంది.తాజాగా అక్కడ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ కు పట్టున్న ప్రాంతం కావడంతో దాదాపు ఎక్కడా ఉన్న విధంగా పంజాబ్ లో కూడా రాజకీయాలు, వర్గ పోరాటాలు అన్నవి నడుస్తూనే ఉన్నాయి.వీటిని నిలువరించేందుకు రాజకీయ శక్తులు కొన్ని ప్రయత్నిస్తున్నా అవేవీ నెగ్గుకు వచ్చేలా లేవు. కొద్దిసేపు నెగ్గిన విధంగా అనిపించినా కూడా కొంత సమయానికి అవి షరామామూలే అన్న విధంగా తయారవుతాయి. ఈ సారి మాత్రం సిద్ధూ కాస్త వెనక్కు తగ్గి రాహుల్ నిర్ణయమే తనకు శిరోధార్యం అన్నవిధంగా మాట్లాడుతున్నారు. అంటే ఆయన మాటకు తాను విలువ ఇస్తానని నేరుగా చెబుతున్నారు. ఇక సీఎం కలనుపక్కన పడేశారని అనుకోవాలా?