ఉద్యోగ సంఘాలపై ప్రభుత్వం ఎక్కడ కూడా ఆధిపత్య ధోరణి చూపలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని సజ్జల అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా.. ఉద్యోగులకు న్యాయం చేయడానికే ప్రయత్నించామని అన్నారు. ఎక్కువ ఫిట్ మెంట్ ఇవ్వకున్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మించి ఇచ్చామని అన్నారు. అలాగే ఉద్యోగ సంఘాలు అంగీకరించాయని తెలిపారు. అలాగే చర్చలు ముగిశాక ఉపాధ్యాయ సంఘాలు మరోలా మాట్లాడం సరికాదని అన్నారు.
ఆదివారం రోజు జరిగిన చర్చలలోనే తమ సమస్యలు చెబితే పరిష్కరించేవాళ్లమని అన్నారు. అలాగే చర్చల సమయంలోనే హెచ్ఆర్ఏ వల్ల ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల తమ దృష్టికి తీసుకువచ్చాయని అన్నారు. దానిని చర్చల్లో సరి చేశామని అన్నారు. చర్చల్లో మినిట్స్ పూర్తి అయిన తర్వాత బయటకు వెళ్లి మాట్లాడటం వల్ల లాభం లేదని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఉద్యోగులు అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞాప్తి చేశారు. అలాగే తమ ప్రభుత్వం ఉద్యోగ విరమణ గురించి ఎవరూ డిమాండ్ చేయకున్నా.. 62 ఏళ్లకు పెంచామని గుర్తు చేశారు.