గుంటూరు ఖాకీల పై పొలిటికల్ వత్తిళ్లు…!

-

గుంటూరు జిల్లాలో ఖాకీల పై పొలిటిషియన్ లు అదిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. రోజుల వ్యవదిలో రెండు సంచలన వ్యవహారాలు వెలుగులోకి రావటం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.మెన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం..నిన్న రైతులకు బేడీల వ్యవహరం..రెండు కీలక విషయాల్లో కూడ పొలిటిక్ ప్రెజర్ ఖాకీల పై తీవ్ర ప్రభావం చూపించింది.దీంతో సస్పెండ్ చేసిన ఆరుగురు పోలీసుల పై 24గంటలు తిరగకుండా అదికారులు చర్యలను తమంతట తాముగా నిలుపుదల చేసుకోవాల్సి వచ్చింది.

ఇటీవల కాలంలో పల్నాడు ప్రాంతంలో కీలకమయిన గురజాల పోలీస్ స్టేషన్ సీఐ తో పాటుగా డీఎస్పీ స్దాయి అదికారి పై సస్పెన్షన్ వేటు వేశారు.పేరుకు ఎస్సీ,ఎస్టీ కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో సస్పెన్షన్ వేటు వేశామని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేశారు.అయితే అసలు సంచలన కారణం మరొకటి ఉంది.. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ ,ఆమె ముఖ్య అనుచరులు సిబ్బంది మెత్తం 7గురు ఫోన్ లను డీఎస్పీ,సీఐ కలసి ట్యాపింగ్ కు పాల్పడ్డారు.ఇందులో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తో పాటుగా మరో ఎమ్మెల్సీ,పార్టిలోని మరో ముఖ్య నేత పై కూడ ఆరోపణలు వ్యక్తం అయ్యాయి.

ఇక తాజాగా రాజదాని రైతులకుబేడీలు వేసిన వ్యవహరంలో కూడ పొలిటికల్ లీడర్ల వత్తిళ్లతో ఖాకీలకు తలనొప్పిగా మారింది.రైతులకు బేడీలు వేసిన ఘటనలో గుంటూరు ఎస్పీ విశాల్ గున్నీ ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్ళ పై సస్పెన్షన్ వేటు వేశారు.అయితే సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించిన 24గంటల్లో పే సస్పెషన్ ఆర్డర్ ను నిలుపుదల చేశారు.అమరావతి రాజదాని కోసం ఆందోళన జరుగుతుండాగానే, మూడు రాజదానులకు అనుకూలంగా కూడ ఆందోళన జరుగుతుంది.ఇందులో ప్రభుత్వ భాగస్వామ్యం ఉందని కూడ ప్రచారం ఉంది.

ఈ సమయంలో ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లను అమరావతి రైతులకు బేడీలు వేశారన్న కారణంగా సస్పెండ్ చేస్తే ఎలా అంటూ పొలిటికల్ గా వత్తిడి వచ్చిందీ.దీంతో ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్ల పై సస్పెషన్ ను నిలిపివేసి,పూర్తి విచారణ తరువాత చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పుకోవాల్సి వచ్చింది.ఇలా కీలకమయిన వ్యవహరాల్లో పోలీసు శాఖ పై పొలిటికల్ వత్తిడి పెరిగిపోవటంతో ఎం చేయాలనే అంశం పై పోలీస్ బాస్ లు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news