తెలుగు దేశం పార్టీ యువ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్… జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి… అందరినీ షాక్ కు గురి చేశారు. ఇవాళ గుంటూరు జిల్లా కుంచన పల్లి లో నారా లోకేష్ పర్యటించారు. అయితే.. ఈ సందర్భంగా ఎవరూ ఊహించని విధంగా… నారా లోకేష్… కుంచన పల్లి లో ఉన్నటు వంటి.. జనసేన పార్టీ కార్యాలయానికి… వెళ్లారు. పార్టీ కార్యాలయంలోకి వెళ్లిన నారా లోకేష్… ఈ సందర్భంగా.. జనసేన పార్టీ నేతలు, కార్య కర్తలతో మాట్లాడారు.
కుంచన పల్లి లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్టీ విషయాలను వారితో నారా లోకేష్ చర్చించినట్లు సమాచారం అందుతోంది. అయితే.. టీడీపీ పార్టీ ఉండగా… జనసేన పార్టీ కార్యాలయానికి నారా లోకేష్ ఎందుకు వెళ్లాడని అందరిలోనూ… ఓ సందేహం వస్తుంది. ఇక అటు మొదటి నుంచి జనసేన పార్టీ, తెలుగు దేశం పార్టీలు రెండు ఒక్కటేనని వైసీపీ పార్టీ చెబుతూనే వస్తుంది. ఇలాంటి తరుణంలో.. నారా లోకేష్ జనసేన పార్టీ కార్యాలయంలోకి వెళ్లడం… మరో చర్చకు దారితీస్తుంది.