ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు ఏమో గాని ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న దూకుడు అన్నీ కూడా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ 9 నెలల కాలంలో ఇప్పటి వరకు చంద్రబాబు మీద చేసిన ఏ ఆరోపణ కూడా జగన్ సర్కార్ నిరూపించలేకపోతుంది అనేది వాస్తవం. అయితే ఇప్పుడు మాత్రం దూకుడు పెంచింది.
నువ్వు నన్నేం చేయలేవు అన్నట్టు చంద్రబాబు మాట్లాడిన మాటలు జగన్ కి ఎక్కడ తగిలాయో తెలియదు గాని ఇప్పుడు ఆయన ప్రదర్శిస్తున్న దూకుడు మాత్రం చంద్రబాబుకి చికాకుగానే ఉంది. ఊహించని విధంగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న సమంయలో అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న కార్మిక శాఖలో అవినీతి జరిగింది అంటూ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది.
దీనిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team – SIT) విచారణకు ఆదేశించింది. దాదాపు 70 కోట్ల మేర అవినీతి జరిగింది అనేది ప్రభుత్వ ఆరోపణ. దీనిపై ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. అసలు తాను అలాంటిది ఏమీ చేయలేదని, ఏ విచారణకు అయినా తాను సిద్దమని ప్రకటించారు అచ్చెన్న. దీనితో రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది.
అయితే తెలుగుదేశం పార్టీ దీనిపై ధీమాగా ఉంది. ఏ విచారణ చేసుకున్నా సరే తనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని చంద్రబాబు కూడా ధైర్యంగా ఉన్నారు. ఇక్కడ అయినా చంద్రబాబు దొరికితే ఇబ్బంది పెట్టవచ్చు అని వైసీపీ కూడా భావిస్తుంది. అందుకే అధికార పార్టీ నేతలు ఇప్పుడు దీనిపై ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా టీడీపీ కార్యకర్తలు అయితే, ఇలాంటివి చాలా చూసారు చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.