అనంత‌కు నీళ్లు తెప్పివ్వ‌డం పూర్వజ‌న్మ సుకృతం : చంద్ర‌బాబు

-


అనంత‌పురం (భైరవానితిప్ప): శ్రీకృష్ణ దేవరాయలు ఎప్పుడో నిర్మించిన చెరువులకు… నీళ్లు రప్పించడం తన పూర్వ జన్మ సుకృతమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులను పూర్తిచేసి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని జిల్లా వాసులకు భరోసా ఇచ్చారు. బైరవానితిప్ప ప్రాజెక్టును జనవరిలోగా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ప్రజలకు అందజేస్తామని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు రైతులు, ప్రజలు సహఆకరించాలని సీఎం కోరారు. భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అందించే కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. భైరవానితిప్ప ప్రాజెక్టు వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి బీటీ ప్రాజెక్టును పరిశీలించారు.

అనంతరం ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని నిలదీసే తాము ఎన్డీయే నుంచి వైదొలిగామని… అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాల్లో అభివృద్ధి నిమిత్తం విడుదల చేసిన నిధులను సైతం కేంద్రం వెనక్కి తీసుకుందని.. ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు. మోదీ కంటే సీనియర్‌ రాజకీయ నేతని అయిన తనను పట్టుకుని మెచ్యురిటీ లేదని ఆయన పార్లమెంటులో మాట్లాడటం ఏంటని? ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మహాకూటమిలో చేరితే అందుకు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news