“కష్టాల్లో ఆలీకి అండగా ఉన్నా. స్నేహమంటే ఇదేనా? ఆలీని వైసీపీ నేతలు వాడుకుంటున్నారు.అలీ వేరే పార్టీలో చేరినంత మాత్రాన నాకేం నష్టం లేదు..” అంటూ తనపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అలీ స్పందించాడు. రాజమండ్రిలో పవన్ తనపై చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని తెలిపాడు. రాజమండ్రి తన స్వస్థలమని, పుట్టిన గడ్డకు తన తండ్రి పేరున చేతనైనంత సేవ చేస్తున్నానని తెలిపాడు. పవన్ కళ్యాణ్ పై ఘాటుగా స్పందించిన అలీ.. మీరు చిరంజీవి వేసిన బాటలో వచ్చారు.. కానీ నేను నా బాట వేసుకొని పై కొచ్చాను. నేను మీ స్థానాన్ని గుండెలో పెట్టుకున్నాను, పవన్ గారు మీరు ఎప్పుడూ బావుండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి లైన్ లో మొదటి వ్యక్తిని నేను. అంటూ బావోద్వేగానికి గురయ్యాడు.
మీరు ఏవిధంగా సాయపడ్డారు..
అలీ కష్టాల్లో వున్నప్పుడు సాయపడ్డా అన్నారు కదా సార్… మీరు ఎప్పుడు ఏవిధంగా సాయపడ్డారు సార్..? అంటూ ప్రశ్నించాడు అలీ. డబ్బు సాయం ఏమన్నా చేశారా?? నాకు ఏమైనా సినిమాలు చెప్పారా?? సినిమాలు లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్లి అవకాశాలు ఇప్పించారా? అంటూ విరుచుకుపడ్డాడు. సర్.. మీరు ఇండస్ట్రీలోకి రాకమునుపు నుంచి నేను ఒక మంచి పొజిషన్ లో ఉన్నాను సర్. నేను ఎవ్వరి దగ్గరా అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను. రూపాయి సాయం చేయమని ఏనాడూ ఎవ్వరి దగ్గరా అడగలేదు. అంటూ చెప్పుకొచ్చాడు.
అల్లా దయవల్ల చాలా బాగున్నాను. ఇంకా అడిగే అవకాశం వస్తే అప్పటికి ఆలీ ఉండడు. వెళ్లను కూడా. ఆకలితో చచ్చిపోతాను తప్ప వెళ్లి అమ్మా.. దేహీ అనే స్థితికి వెళ్లను. అంటూ తెలిపాడు.
వైయస్సార్ సీపీలో వెళ్లటం తప్పేంటి? అదేమైన నేరమా?
వైయస్సార్ సీపీలో వెళ్లటం తప్పేంటి? అదేమైన నేరమా? రాజ్యాంగంలో రాసుందా అక్కడకు వెళ్లకూడదని. నాకు స్వేచ్ఛ లేదా? మీ గురించి నేను వ్యాఖ్యానిస్తే మీరు నాగురించి కామెంట్ చేయాలి. రాజమండ్రిలో మీరు కామెంట్ చేయటం సరికాదు.
మీరు నా చుట్టానికి టిక్కెట్ ఇచ్చానని పవన్ అంటున్నారు. నేను మిమ్మల్ని వచ్చి అడిగానా? పోనీ ఇచ్చే ముందు నన్ను అడిగారా, అదెలా చెబుతారు సర్. నా నెంబర్ మీ దగ్గర ఉంది. 12- 14 ఏళ్లు నుంచి ఒకే నెంబర్ మెయింటైన్ చేస్తున్నాను. పార్టీలోకి రమ్మను పవన్ ఎప్పుడైనా అడిగారా? అడగను అప్పుడు ఇంత పెద్ద కామెంట్ చేయటం ఎందుకు? అని ఆలీ ఆవేదన వ్యక్తం చేశారు.