తెలంగాణ కాబోయే సీఎం రేసులో ఈట‌ల‌?

-

  • బ‌హిరంగంగానే ప్ర‌భుత్వ లోపాల‌ను ఎత్తిచూప‌డంలో లోగుట్టు ఏంటీ?
  • టీఆర్ ఎస్‌లో ఏం జ‌రుగుతోంది?

హైద‌రాబాద్ : ఊస‌ర‌వెల్లి రంగులు మార్చిన తీరుగా రాజ‌కీయాల్లోనూ క్ష‌ణ క్ష‌ణానికి ఊహించ‌ని రీతోలో మార్పులు చోటుచేస‌కుంటూనే ఉంటాయి. తాజాగా తెలంగాణ అధికార పార్టీలో టీఆర్ ఎస్‌లోనూ ఇదే మాదిరిగా రాజ‌కీయాలు మారుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇదివ‌ర‌కు తెలంగాణ‌కు కాబోయే సీఎం కేటీఆర్ అంటూ తీవ్రంగా చ‌ర్చ‌జ‌రుగుతోంది. దీనిని అనుగుణంగానే ప‌లువురు అధికారా పార్టీ నేత‌లు, ఎమ్మెల్యేల‌తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా కాబోయే సీఎం కేటీఆర్ అంటే పల్ల‌వి అందుకున్నారు.

ఇక తాజాగా ముఖ్యమంత్రి రేసులోకి టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత దూసుకోచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌నే రాష్ట్ర మంత్రి ఈటల రాజేంద‌ర్‌. సీఎం కేసీఆర్.. కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేయాడానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నార‌ని ఎమ్మెల్సీ అభ్య‌ర్థి చెరుకు సుధాక‌ర్ తాజాగా వెల్ల‌డించారు. కేటీఆర్ వ‌ద్ద‌ని ఈట‌ల‌ను సీఎం చేయాల‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ద‌ళితుడిని సీఎం చెస్తాన‌న్న కేసీఆర్.. రాష్ట్రం ఎర్ప‌డిన త‌ర్వాత ఆయ‌నే సీఎం ప‌దవిలో కూర్చున్నార‌ని గుర్తు చేశారు.

ఇక గ‌త కొంత కాలంగా ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌భుత్వ వైప‌ల్యాల‌ను ఎత్తి చూపుతూ బహిరంగంగానే వ్యాఖ్య‌లు చేయ‌డం తీవ్ర దుమార‌మే రేపుతోంది. రెండో సారి అధికారం చెప‌ట్టిన టీఆర్ ఎస్ మంత్రివ‌ర్గంలో ఈట‌ల‌కు చోటు ద‌క్క‌ద‌ని విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. స‌మ‌యంలో అధినాయ‌క‌త్వంలో దూరంగా ఉన్న ఈట‌ల.. పార్టీలోని అంత‌ర్గ‌త విష‌యాల‌పై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. అయితే, కొద్ది రోజుల‌కే ఆ టాక‌పిక్‌పై చ‌ర్చ ముగిసిన‌ప్ప‌టికీ.. టీఆర్ ఎస్ లో అంత‌ర్గ‌తంగా ఈ విష‌య‌పై తీవ్రంగా చ‌ర్చ జ‌రుగుతున్న‌ద‌ని స‌మాచారం.

ఇక కేటీఆర్‌ను సీఎం చేస్తే.. ఈట‌ల‌ను ఉప‌ముఖ్య‌మంత్రిని చేయాల‌ని ప్రాతిపాద‌నను కేటీఆర్‌కు చేయ‌గా.. సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో మ‌ళ్లీ ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ.. ఆస్త్రాలు సంధిస్తున్నార‌ని రాజకీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అదేం కాదు ఉప ముఖ్య‌మంత్రి అయితే..స్థానికంగా ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌డం కుద‌ర‌ద‌నే ముందుగానే ఇప్పుడు ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నార‌ని ఆయ‌న స‌న్నిహిత శ్రేణులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇవే కాకుండా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ పుంజుకుంటున్న‌ద‌నే ప‌రిణామాల నేప‌థ్యంలో క‌మ‌ళానికి చెక్ పెట్ట‌డానికి ఈ విధంగా వ్యూహాంలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏదేమైన‌ప్ప‌టికీ.. ఈట‌ల సీఎం అవుతారో? లేక ఉప‌ముఖ్య‌మంత్రి అవుతారో? మంత్రి ప‌దితోనే ముందుకు సాగుతారో అనేది కాల‌మే నిర్ణ‌యించాలి ఇక .. !

Read more RELATED
Recommended to you

Latest news