మళ్ళీ వైఎస్‌ జగన్‌దే అధికారం…..ఎన్‌ఏఐ సంచలన సర్వే

-

సీట్లు కొన్ని తగ్గుతాయేమోగానీ ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం పక్కా అంటోంది ఎన్‌ఏఐ సర్వే.ఈ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో అద్భుత అంశాలు వెలుగులోకి వచ్చాయి.120కిపైగా సీట్లను మళ్ళీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలవబోతోందని ఈ సంస్థ కుండబద్దలు కొట్టింది.డిసెంబర్ 1, 2023 నుండి జనవరి 12, 2024 వరకు మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ సంస్థ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది.నేరుగా వారిని సంప్రదించి వివిధ అంశాలను ప్రస్తావించి వారి అభిప్రాయాన్ని నమోదు చేసింది.

ఈ సర్వేలో మెజారిటీ ప్రజలు వైఎస్‌ జగన్‌వైపే ఉన్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. తెలుగుదేశం పార్టీ-జనసేన కూటమి పెద్ద ప్రభావం చూపడం లేదని తేల్చేసింది. పవన్‌ రాకతో కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉన్నా ప్రభుత్వ ఏర్పాటుకి కావలసిన సీట్లు ఆ కూటమి గెలుచుకోలేదని ఎన్‌ఏఐ తేల్చి చెప్పింది.అటు భారతీయ జనతాపార్టీ కూడా ప్రజల ఆదరణ పొందే అవకాశం లేదని స్పష్టం చేసింది.

ప్రజల మనోభావాలు, ప్రాధాన్యతలను ఎన్‌ఏఐ సరిగ్గా అంచనా వేసిందనే చెప్పాలి.ఈ సంస్థ అనేక అంశాలను తన సర్వేలో కవర్‌ చేసింది.పథకాల అమలు/ప్రాంతీయ సమస్యలు,అభివృద్ధి విధానాలు,రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా సాధన,పబ్లిక్ సర్వీసెస్ మరియు గవర్నెన్స్, మీడియా ప్రభావం,కులం మరియు కమ్యూనిటీ డైనమిక్స్,లా అండ్ ఆర్డర్,కరెంట్ ఈవెంట్‌లు మరియు నేషనల్‌తో ప్రాంతీయ పార్టీ ప్రాధాన్యతలతో పాటు అనుబంధం సంఘాల ప్రభావాలు వంటి అంశాల ఆధారంగా ఈసర్వే జరిగింది.

ముఖ్యమంత్రి పనితీరు మొదలు క్షేత్రస్థాయి వరకు వైసీపీ విధానాలను ఈ సంస్థ సేకరించిది. అలాగే ప్రతిపక్ష పార్టీలను కూడా సమగ్రంగా అధ్యయనం చేసింది.స్థానిక అభ్యర్ధుల పనితీరు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారా లేదా అనే అంశాలను కూడా కవర్‌ చేసింది.ఎన్‌ఏఐ సంస్థ సేకరించిన నమూనాల్లో అద్భుత విషయాలు వెలుగుచూశాయి.అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి జనాభాలో అనేక సానుకూలతలు కనిపించాయి.సంక్షేమ పథకాలు చాలా వరకు లబ్ధిదారులకు చేరవేయడమే కాదు వాటిని మహిళలకు అందించడంలో వైసీపీ అతివల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది.పెన్షన్‌లను నేరుగా ఇంటి వద్దకు తెచ్చి వడ్డంతో వృద్ధులు వాడవాడలా హర్షం వ్యక్తం చేస్తున్నారు.పెన్షన్ మొత్తాన్ని క్రమంగా పెంచడం కూడా వైసీపీకి ప్లస్‌ అయింది.

విద్య, ఆరోగ్యం విబాగాలకు వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనేక కార్యక్రమాలు రుజువు చేశాయి.BC, SC, మరియు ST వర్గాలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించారు. ఆధునిక మౌలిక సదుపాయాలతో రాష్ట్రం ఒక మెట్టు ఎక్కింది.వైసీపీకి కొన్ని ప్రతి కూలతలు కూడా ఉన్నాయి.అయితే వాటిని ప్రజలు పట్టించుకోవడం లేదనే చెప్పాలి.నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల పట్ల కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉన్నా వాటిని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదనేది తేలిపోయింది. ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోయినా వాలంటీర్‌ల ద్వారా సంక్షేమ పథకాలు అందడంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు.

ఇక ప్రతిపక్ష తెలుగుదేశం-జనసేన కూటమికి అనుకూల అంశాలకంటే ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. JSPతో TDP పొత్తు తర్వాత కాస్త బలపడింది. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ కొంత మైలేజీ ఇచ్చినా మెజారిటీ ప్రజల ఓట్లను రాబట్టేందుకు ఇది ఏమాత్రం ఉపయోగపడటం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వం లేకపోవడం,టీడీపీకి చెందిన సాంప్రదాయ ఓటర్లు ఇప్పటికీ కూటమికి మద్దతు ఇవ్వడానికి వెనుకాడటం,పార్టీ ప్రధాన విలువలను పాటించకపోవడం తెలుగుదేశం పార్టీకి ప్రతికూల అంశాలుగా కనిపిస్తున్నాయి.రానున్న ఎన్నికల్లో ఇవి ప్రభావం చూపే అవకశాలు ఉన్నాయి.

ఇక జనసేన విషయానికి వస్తే…ఎక్కువ సంఖ్యలో యువతను తనవెంట తిప్పుకోవడంలో పవన్‌కళ్యాణ్‌ సక్సస్‌ అయ్యారు.అలయన్స్ తర్వాత ఇరు పార్టీల విధివిధానాల్లో ఉన్న తేడాలను ప్రజలు గమనిస్తున్నారు.ఈ రెండు పార్టీలు పూర్తిగా కలవడం లేదని ప్రజలు గ్రహిస్తున్నారు.పార్టీలోని సెకండ్‌ కేడర్‌ ఈ అలయన్స్‌ను అసలు అంగీకరించడం లేదు. సీట్లు పంచుకునే విధానంపై కూడా వ్యతిరేకత వస్తోంది. దీంతో నేతలు కార్యకర్తల మధ్య దూరం పెరుగుతోంది.

మొత్తంగా చూస్తే ఎన్‌ఏఐ సంస్థ చేపట్టిన సర్వేలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 122 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. దీంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పింది.తెలుగుదేశం పార్టీ-జనసేన కూటమికి 53 సీట్లు మాత్రమే వస్తాయని స్పష్టం చేసింది. మళ్ళీ ఆ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమవుతుందని తేల్చేసింది.భారతీయ జనతాపార్టీ గతం కంటే ఓట్ల షేర్‌ పెంచుకున్నా ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదని చెప్పింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ,ఇతరులు కూడా అసలు పోటీ ఇవ్వలేరని స్పష్టం చేసింది.

రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి తెలుగుదేశం-జనసేన కూటమి మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని తేల్చేసింది ఎన్‌ఏఐ సంస్థ.

Read more RELATED
Recommended to you

Latest news