మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది… నాలుగు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఎన్సీపీని తీవ్రంగా కలవరానికి గురి చేసారు. ఆయనతో శరద్ పవార్ పలు మార్లు మాట్లాడే ప్రయత్నం చేసినా ఆయన వెనక్కు తగ్గలేదు. ఇప్పుడు అనూహ్యంగా ఆయన రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆయనతో ఉదయం నుంచి శరద్ పవార్ భార్య మంతనాలు జరుపుతున్నారు.
అదలా ఉంటే ఇప్పుడు కొన్ని పరిణామాలు చూస్తే… పవార్ ఫ్యామిలీ ఉచ్చులో బిజెపి చిక్కుకుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. బిజెపికి వారం రోజుల సమయం ఇచ్చి, ప్రతిపక్షాలకు 24 గంటల సమయం కూడా ఇవ్వకుండా చివరికి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసారు మహారాష్ట్ర గవర్నర్… సాదారణంగా ఒకసారి రాష్ట్రపతి పాలన వస్తే, మళ్ళీ ఎన్నికలు తప్ప గత్యంతరం ఉండదు కాబట్టి… శరద్ పవార్ ఇక్కడి నుంచి ఆయన రాజకీయానికి పదును పెట్టారు… అది పెద్ద సమస్యగా చూడని ఆయన… శివసేనకు మద్దతు ఇచ్చే విషయంలో…
నానుస్తూ వచ్చారు… పలు మార్లు సోనియా గాంధీతో సమావేశం అయ్యారు… మద్దతు ఇస్తున్నట్టే ఇచ్చి మళ్ళి ఆయన వెనక్కు తగ్గారు. ఇచ్చే అవకాశం లేదనే సంకేతాలు కూడా ఆయన ఇచ్చారు… ముందు రాష్ట్రపతి పాలన ఎలా ఎత్తివేయ్యాలి అనే దాని మీద దృష్టి సారించిన ఆయన… ఇక్కడే అజిత్ పవార్ ని రంగంలోకి దింపారు. ఆయన ఎవరో కాదు… 30 ఏళ్ళ నుంచి శరద్ పవార్ కు నమ్మిన బంటు… బిజెపి ఆయనతో చర్చలు జరపడం మొదలుపెట్టింది. ఆయన మద్దతు కోసం ప్రయత్నాలు రహస్యంగా చేసి కొంత మంది సంతకాలు చేయించింది.
ఇక ఆయన మద్దతు వచ్చి౦ది అనుకున్న కేంద్రం రాత్రికి రాత్రి కేబినేట్ సమావేశం కూడా లేకుండా రాష్ట్రపతి పాలన ఎత్తేసింది. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రజాస్వామ్యం గెలిచిందని కొందరు ఓడిందని కొందరు సోషల్ మీడియాలో హడావుడి కూడా చేసారు. ఇదే సమయంలో అజిత్ పవార్ పై ఉన్న కేసులు ఎత్తేస్తూ క్లీన్ చిట్ వచ్చింది. ఇదే సమయంలో కిడ్నాప్ అయిన ఎమ్మెల్యేలు… వెనక్కు వచ్చారు… సోమవారం జరిగిన పరేడ్ లో 162 మందిలో వారు కూడా ఉన్నారు… ఇదంతా చూస్తే… పవార్ ఫ్యామిలీ ఉచ్చులో బిజెపి చిక్కుకుంది అనే విషయం అర్ధమవుతుంది.