ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా కూడా తెలంగాణలో ఇప్పుడు ప్రతిపక్షాలా బాగానే బలపడిపోతున్నాయి. ఇంతకు ముందు అయితే కేసీఆర్ ట్రెండ్ సెట్ చేసే స్థాయిలో ఉండేవారు. ఆయన ఏది చెప్తే అది ట్రెండ్ అయిపోయేది. అలాంటి తరుణం నుంచి ఇప్పుడు ప్రతిపక్షాల ప్రశ్నలకు అధికార పార్టీ జవాబు చెప్పే స్థాయికి వచ్చేసింది. ఇక కాంగ్రెస్ క్రమ క్రమంగా బలపడిపోవడం కూడా టీఆర్ ఎస్‌కు పెద్ద మైనస్ అని చెప్పాలి. రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక నేరుగా కేసీఆర్, కేటీఆర్ మీద చేస్తున్న విమర్శలు బాగానే ఇబ్బంది పెడుతున్నాయి.
ఇక ఇప్పుడు కేసీఆర్ మీద మరింత ధీటాగా పోరు సాగించేందుకు మరో పెద్ద వ్యూహాన్ని అమలు చేస్తున్నారు రేవంత్‌రెడ్డి. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ మినహా మిగతా పార్టీలను కలుపుకుపోయే పనిలో పడ్డారు. ఇక ఆయా పార్టీల్లోని వారందరినీ ఏకతాటిమీదకి తెచ్చేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన రీసెంట్ గా గాంధీభవన్‌లో బీజేపీ కాకుండా మిగతా వారిని ఆహ్వానించారు.
ఇందులో కమ్యూనిస్టు పార్టీలు అయిన సీపీఎం, సీపీఐతో పాటుగా తలెంగాణ జన సమితి, తెలంగాణ ఇంటి పార్టీలు రేవంత్ తో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చాయి. ఇక ఈ పార్టీలన్నింటినీ కలుపుకుని రేవంత్ త్వరలోనే పెద్ద ఉద్యమాలకు తెరలేపుతున్నారు. పోడు భూముల సమస్యలపై, నిరుద్యోగం, రైతు సంఘాలు త్వరలోనే చేయనున్న భారత్ బంద్ ఇలా వరుస నిరసనలకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. రాబోయే రెండు నెలలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి ఈ పార్టలు అన్నీ కలిసి. ఈ పార్టీల మద్దతుతో రేవంత్ ఇమేజ్ మరింత పెరిగింది.