అమలాపురం నియోజకవర్గానికి మంత్రి పినిపే విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబోయే ఎన్నికల్లో తన కుమారుడును బరిలో దించాలని ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని జగన్ దృష్టిలో ఉంచగా అప్పటినుండి మౌనంగా ఉన్న అధినేత అమలాపురం టూర్ లో విశ్వరూప్ కు క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గంలో నువ్వు తిరుగు లేదా నీ కొడుకుని తిప్పు పార్టీ మాత్రం అధికారంలోకి రావడం ముఖ్యమని జగన్ క్లారిటీ ఇచ్చారు. తన కుమారుడికి టికెట్ ఇచ్చారని ఆనందం విశ్వరూప్‌కి లేకుండా చేస్తున్నారు పార్టీలోని అసమ్మతినేతలు.
అమలాపురం అల్లర్ల నాటి నుండి విశ్వరూప్, శెట్టిబలిజ నేత వాసంశెట్టి సుభాష్ కు మధ్య యుద్ధం నడుస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. సుభాష్ తండ్రి సత్యంకు జగన్ భరోసా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ వాసంశెట్టి సుభాష్ తన వర్గానికి ఈసారి మనమే పోటీ చేస్తామని చెబుతూ ఉత్సాహాన్ని నింపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
విశ్వరూప్ కు, అమలాపురం ఎంపీ చింత అనురాధకు మధ్య సఖ్యత లేదు. ఇదే అదునుగా విశ్వరూప్ కు వ్యతిరేకంగా చింతా అనురాధ, వాసంశెట్టి సుభాష్ కలిసి పనిచేయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికలలో విశ్వరూప్, సుభాష్ కలిసి పనిచేస్తేనే వైసిపికి గెలుపు కష్టంగా ఉన్న పరిస్థితులలో, ఇద్దరు ఉప్పు నిప్పులా ఉంటే పార్టీకి తీవ్ర నష్టమని సర్వేలు అధిష్టానానికి చెబుతున్నాయి.
ఎమ్మెల్యేగా చింత అనురాధకు టికెట్ ఇచ్చి, విశ్వరూప్ ను లేదా ఆయన తనయుడుని అమలాపురం ఎంపీగా నిలబెడితే, అనురాధ, సుభాష్ కలిసి పనిచేసి వైసీపీని గెలిపిస్తారని అధిష్టానం ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే..టిడిపి-జనసేన కలవడం..అమలాపురంలో వైసీపీ నుంచి ఎవరు పోటీ చేసిన గెలుపు డౌటే.
ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో విశ్వరూప్‌కు 72 వేల ఓట్లు రాగా, టిడిపికి 46 వేలు, జనసేనకు 45 వేల ఓట్లు వచ్చాయి. రెండు పార్టీలు వేరుగా పోటీ చేయడంవల్ల విశ్వరూప్ గెలిచారు. కలిస్తే 91 వేల ఓట్లు అంటే వైసీపీని ఓడించేవారు. ఇప్పుడు రెండు పార్టీలు కలిశాయి. దీంతో ఎవరు పోటీ చేసిన వైసీపీకి రిస్క్ తప్పదు.