సడలింపులు ఉన్నా బయటికి రాని జనం..

-

కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాగా పోరాడుతున్నాయి. ఈ వైరస్ కి మందు లేకపోవటంతో ప్రస్తుతం ఉన్న ఒకే ఒక మార్గం నియంత్రణ చేపట్టడం తో లాక్ డౌన్ ను చాలా పటిష్టంగా అమలు చేస్తున్నాయి. తొలి దశ లాక్ డౌన్ లో కరోనా వైరస్ కంట్రోల్ కాకపోవటంతో మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడం మనకందరికీ తెలిసిన విషయమే.Bharatkalyan97: Rakhigarhi, capital of Sarasvati Civilization ...అయితే ఆ సమయంలో ఏప్రిల్ 20 నుండి కొన్ని సడలింపులు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఏపీలో ఆ సడలింపులు అమలవుతున్నా ప్రజలు ఎవరు బయటకు రాకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. భవన నిర్మాణ కార్మికులు అదేవిధంగా పరిశ్రమ రంగానికి చెందిన కార్మికులు తమ పనులు చేసుకోవచ్చని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులలో తెలపటం జరిగాయి.

అయినా కానీ పారిశ్రామిక భవన నిర్మాణ కార్మికులు ఎవరు కూడా ఇల్లు వదలి బయటకు రావటం లేదు. కరోనా అంటే భయం , పని చేసుకోవడానికి అవకాశాలు దొరక్క ఇంటికే పరిమితమవుతున్నారు .దీనికి తోడు పోలీసు బందోబస్తీ  ఎటు వెళ్తే ఏమవుతుందోని జనం రోడ్డెక్కడానికి జంకుతన్నారు. ఈ పరిస్థితులు ఇప్పట్లో మారవు

Read more RELATED
Recommended to you

Latest news