నామినేషన్లను అడ్డుకున్న వైసీపీ నేతలు ?

-

  • ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు
  • నెల్లూరు, కడప జిల్లాల్లోని రెండేసి మండలాల్లో దాఖ‌లుకాని నామినేషన్లు
  • మొటిరోజు దాఖ‌లైన‌ 3,515 నామినేషన్లు
  • పలుచోట్ల ఉద్రిక్తతలు.. రసవత్తరంగా ఏపీ రాజకీయాలు

అవరావతి: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.  శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే, ఈ క్రమంలో పలు  చోట్ల ఉద్రిక్తత నెలకొన్నది.  కడప, నెల్లూరు జిల్లాల్లోని రెండేసి మండలాల్లో సర్పంచ్ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖ‌లు కాలేదు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని రాంబొట్ల పాలెంలో కొంత వివాదం చోటుచేసుకుంది. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నార‌ని కొంద‌రు ఆరోపించారు. ఈ విష‌యంపై ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఫిర్యాదు కూడా చేశారు.

నిన్ననామినేషన్ల స్వీకరణ మొదల‌వ్వ‌డంతో మొద‌టిరోజు 3,515 నామినేషన్లు దాఖ‌ల‌య్యాయి. అందులో 1,315 సర్పంచ్, 2,200 వార్డు స్థానాల‌ నామినేషన్లు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో సర్పంచ్ స్థానాలకు అధికంగా 248 నామినేషన్లు దాఖలైనాయి. నెల్లూరు జిల్లాలో అతి త‌క్కువ‌గా 27 నామినేషన్లు మాత్ర‌మే దాఖలయ్యాయి. కాగా, విజయనగరం మినహామిగిలిన అన్ని జిల్లాల్లో మొదటి విడతలో భాగంగా 3,249 సర్పంచ్‌లు, 32,504 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు.

ఈ విష‌యంపై ఎస్సై, పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాంబొట్ల పాలెం గ్రామానికి చెందిన అక్కల నాగమణి అనే మహిళ ఎస్పీ విశాల్ గున్నీకి ఈ వివాదంపై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో పంచాయతీ కార్యదర్శి తనకు నామినేషన్ పత్రాలు ఇవ్వలేదని.. దానిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాన‌ని పేర్కొంది. అయినా కానీ పోలీసులు త‌న‌పైనే తప్పుడు కేసు పెట్టారని ఎస్పీకి త‌న బాధను చెప్పుకుంది.

ఇదిలా ఉండగా నేడు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ జిల్లాల పర్యటన కొనసాగిస్తున్నారు.  నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష చేసేందుకు నిన్ననిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించారు. నేడు కడపజిల్లాలో పరిస్థితిని సమీక్షించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news