ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే అచ్చంపేట భూముల కేసులో ఆరోపణల కారణంగా ఈటలను మంత్రి వర్గం నుంచి తొలగించింది ప్రభుత్వం. అలాగే దేవరయంజాల్ భూముల కబ్జా విషయంలో కూడా విచారణ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈటలకు మరో పెద్ద దెబ్బ తగిలింది.
ఆయన కొడుకు నితిన్ రెడ్డిపై భూ కబ్జా ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ జిల్లా రావల్‌కోల్‌కు చెందిన మహేశ్ ముదిరాజ్ అనే వ్యక్తి ఈటల కొడుకు నితిన్‌రెడ్డి భూమి కబ్జా చేశాడంటూ సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు.
దీంతో సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. దీనిపై విచారణ జరపాలంటూ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ఏసీబీ, విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో సంపూర్ణ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ సూచించారు. దీంతో ఈటలకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయనపై ఆరోపణలు రాగా.. ఇప్పుడు కొడుకుపై కూడా మరో ఫిర్యాదు రావడం కలవరపెడుతోంది. మరి దీనిపై ఈటల ఎలా స్పందిస్తారో చూడాలి.