జగన్ నోట్లో చక్కర పోస్తున్న బిజెపి నేతలు

-

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బిజెపి నేతలు కొంతమంది అధికార వైసీపీ కారణంగా అలాగే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఎన్నో నిర్ణయాలను బీజేపీ నేతలు సమర్థిస్తూ ముందుకు వెళ్తున్న సరే కేంద్ర ప్రభుత్వం మాత్రం తప్పు ఎక్కువగా చేస్తుంది.

bjp

దీంతో అధికార విపక్షాలు బిజెపిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న తరుణంలో బిజెపి నేతల ఒత్తిడికి గురవుతున్నారు అనే భావన ఉంది. దీనితో చాలామంది మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం చేయడానికి ఆసక్తి చూపించలేదు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు బీజేపీ నేతలు చాలా మంది అధికార వైసీపీ వైపు చూస్తున్నట్టుగా ఈ మధ్యకాలంలో వార్తలు వినపడుతున్నాయి.

మున్సిపల్ ఎన్నికల వరకు రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు వైసీపీలోకి రావడానికి చాలా వరకు ఆసక్తి చూపిస్తున్నారని రాజకీయ వర్గాల మాట. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో కూడా నేరుగా మాట్లాడడానికి బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు సిద్ధమయ్యారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి సహా విశాఖ జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళడానికి చర్చలు జరుపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభావం చూపించడం తో ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని భావించి వైసీపీలోకి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు

Read more RELATED
Recommended to you

Latest news