క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అవుట్‌… ఇన్ ఎవ‌రు..!

762

భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కు షాక్ తప్పదా ? కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించేందుకు అధిష్టానం రంగం సిద్దం చేస్తోందా ? కన్నా స్థానంలో ఏపీ బిజెపి అధ్యక్షుడిగా మరో వ్యక్తి రానున్నాడా ? అంటే జాతీయ బిజెపి రాజకీయాల్లో వినిపిస్తున్న చర్చ‌ల‌ ప్రకారం అవుననే ఆన్సర్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్న కన్నా అనూహ్యంగా మనసు మార్చుకుని బీజేపీలోకి జంప్ చేశారు.

బిజెపిలోకి వెళ్ళిన క‌న్నాకు ఏపీ బిజెపి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. లోక్‌స‌భ ఎన్నికల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన క‌న్నా… రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే విషయంలో వెనుకబడినట్టు బిజెపి జాతీయ నాయకత్వం భావిస్తోంది. కొద్ది రోజులుగా టీడీపీ నుంచి బిజెపిలో చేరిన నేతల ముందు కన్నా చిన్న పోతున్నారు. కన్నా వాయిస్ వీక్‌ అయిపోయిందన్న చర్చలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో ఏపీలో బలంగా ఉన్న వైసిపితో పాటు… ప్రతిపక్ష టీడీపీని వీక్ చేసి ఆ ప్లేస్ లోకి రావాలంటే క‌న్నా వల్ల కాదని బిజెపి భావిస్తోంది.

Kanna Lakshminarayana
Kanna Lakshminarayana

ఈ క్రమంలోనే టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన నేతల్లో ఎవరో ఒకరికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న స‌న్నిహితుల్లో ఎవ‌రో ఒక‌రికి బీజేపీ బాధ్య‌త‌లు ఇస్తేనే టీడీపీని ముందుగా దెబ్బ‌కొట్ట‌వ‌చ్చ‌ని… ఆ త‌ర్వాత వైసీపీ అంతు చూడ‌వ‌చ్చ‌న్న‌దే బీజేపీ ప్లాన్‌గా తెలుస్తోంది. క‌న్నాకు త‌న ప‌ద‌వి ఊస్టింగ్ అన్న విష‌యం తెలియ‌డంతోనే కొద్ది రోజులుగా ఆయ‌న వైసీపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. క‌న్నాకు రాజ్య‌స‌భ ప‌ద‌వి ఇవ్వ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.